ప్రభుత్వానికి అందిన త్రిసభ్య కమిటీ నివేదిక

SMTV Desk 2019-04-27 19:12:15  Intermediate exams, hyderabad, intermediate results, trisabhya committy

హైదరాబాద్‌: రాష్ట్ర ఇంటర్ ఫలితాల తప్పిదాలపై రంగంలోకి దిగిన త్రిసభ్య కమిటీ తాజాగా తన నివేదికను ప్రభుత్వానికి అందించారు. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ కోసం విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. సప్లిమెంటరీ ఫలితాలకు ముందే రీ వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రోజూ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌పై బులిటెన్‌ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో 70వేల నుంచి లక్షన్నర జవాబు ప్రతాల రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ చేస్తామన్నారు. ఇంటర్ వ్యవహారంపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సైతం మీడియాతో మాట్లాడారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇంకా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 10, 12 రోజుల్లో రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ పూర్తి కావొచ్చని ఆయన తెలిపారు. త్రిసభ్య కమిటీ నివేదిక ఎందుకు ఆలస్యం అయిందో కమిటీని వివరణ కోరుతామని ఆయన చెప్పారు.