రేపు బ్యాంకులు బంద్..

SMTV Desk 2017-08-21 13:05:05  BANKS STRIKE, CHIEF LABOUR COMMISSIONER, AIBOC CHIEF OFFICER

ఢిల్లీ, ఆగస్ట్ 21 : బ్యాంకులలో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు రేపు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయడంపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమవడం, ప్రభుత్వం నుంచి గాని, అటు బ్యాంకు యాజమాన్యాల నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో సమ్మె చేయక తప్పడం లేదని ఏఐబీఓసీ ప్రధాన కార్యదర్శి డి.డి. ఫ్రాంకో తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న రుణాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని, అలాగే రుణాలను ఎగవేసే సంస్థలపై కేసులు నమోదు చేయాలన్నది తమ ప్రధాన డిమాండ్ల౦టూ ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. వెంకటాచలం తెలిపారు. ఈ సమ్మెలో ప్రైవేటు బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంకులు మాత్రం పాల్గొనడం లేదు.