ఎవడైనా సరే...మా పర్సనల్ లైఫ్‌లోకి రావొద్దు!

SMTV Desk 2019-04-27 13:26:38  sai tej, sai dharam tej, chitralahari, supreme, varun tej, niharika

హైదరాబాద్: వరుస ఫ్లాప్ లతో ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్.. పలు టీవీ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూలలో చిత్రలహరి చిత్రానికి సంబంధించిన విషయాలే కాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా డాటర్ నిహారికతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ వస్తున్న పుకార్లపై ఫైర్ అయ్యారాయన. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా పెళ్లి గురించి ఏం అనుకోలేదు. ఇంకా నేను సింగిల్ ఆర్మీని వదలదల్చుకోలేదు. కాని నా పెళ్లి విషయంలో చాలా స్టుపిడ్ రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నిహారికతో పెళ్లి అంటూ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. చిన్నప్పటి నుండి నేను నిహారిక నేను బ్రదర్ అండ్ సిస్టర్‌లా ఉన్నాం. నేను, నిహారిక, వరుణ్, మా తమ్ముడు ఇలా అందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌లాగే ఉన్నాం. మా మధ్య మ్యారేజ్ అనే థాట్ ఎప్పుడూ రాలేదు. అయినా చెల్లి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఛీ.. ఛీ.. ఇవి చాలా వరస్ట్. ఎవడుపడితే వాడు ఇలా రాస్తుంటే ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాడు ఎవడైనా సరే. ఇలా రాయడానికి సిగ్గుండాలి. దయచేసి మా పర్సనల్ లైఫ్‌లోకి రావొద్దు. మరోసారి చెప్తున్నా.. నిహారిక నాకు చెల్లితో సమానం’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్.