ఇంటర్ స్టూడెంట్స్ సూసైడ్స్ : తెలంగాణ సర్కార్ కు ఎన్‌హెచ్చార్సీ నోటీసులు

SMTV Desk 2019-04-27 12:32:09  ts

హైదరాబాద్: జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్చార్సీ) తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. ఇంటర్ బోర్డు ఫలితాల తప్పిదాల వల్ల రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై స్పందించిన ఎన్‌హెచ్చార్సీ ఇది తలదించుకోవాల్సిన సంఘటన అని తీవ్రంగా ఆక్షేపించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి, వాటిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. డాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫెయిల్ అయిన పిల్లల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, తగిన విధంగా స్పందించాలని ముఖ్య కార్యాదర్శి జోషిని ఆదేశించింది. నాలుగు వారాల్లో ఈ అంశంపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబాలకు అందించిన సాయం వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది.