ధోని లేకపోతే చెన్నై పరిస్థితి అంతేనా!

SMTV Desk 2019-04-27 11:57:00  ipl 2019, csk vs mi, mahendra singh dhoni, suresh raina

చెన్నై: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నైలోని చేపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లోముంబయి ఇండియన్స్ జట్టు 46 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చెన్నై ఈ ఓటమితో కింగ్స్ జట్టు.. అతిగా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ఆధారపడుతోందని మరోసారి నిరూపితమైంది. ధోనీ టీమ్‌లో ఉంటే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చే చెన్నై.. అతను గాయం లేదా అనారోగ్యం కారణంగా జట్టుకి దూరమైతే.. ఆ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోతోంది. తాజా సీజన్‌లో ఈ విషయం వరుసగా రెండోసారి స్పష్టమైంది. ఈ నెల 17న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కి గాయం కారణంగా ధోనీ దూరమవగా.. ఆ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన చెన్నై.. తాజాగా శుక్రవారం రాత్రి ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌కి జ్వరంతో ధోనీ టీమ్‌లో లేకపోవడంతో ఏకంగా 46 పరుగుల తేడాతో పేలవ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ రెండు మ్యాచ్‌లకీ ధోనీ స్థానంలో సురేశ్ రైనా టీమ్‌ని నడిపించాడు.