త్వరలో కొత్త రూ.20 నోటు

SMTV Desk 2019-04-27 11:55:03  central government, demonetization, new indian currency, new twenty rupees currency

న్యూఢిల్లీ: దేశంలో నోట్ల రద్దు తరువాత ఆర్బేఐ వరుసగా కొత్త కొత్త నోట్లను విడుదల చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో త్వరలో రూ.20 కొత్త నోట్లను కూడా విడుదల చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఇంతవరకు రూ.20 నోటు అంటే ఎరుపు రంగులో వుండేది. ఇప్పుడొచ్చే కొత్త నోటు ఆకుపచ్చని పసుపు రంగులో వుంటుందని తెలిపింది. దానిపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకంతో కూడిన మహాత్మా గాంధీ బొమ్మతో వుండనుందని తెలిపారు. ఇంకా ఈ నోటు ముందు వైపు మహాత్మా గాంధీ ముఖచిత్రం, అశోక స్థూపం, స్వచ్ఛభారత్‌ చిహ్నం వుంటాయి. వెనక వైపు ఎల్లోరా గుహల మూలాంశం వుంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే కొత్తనోటు వస్తున్న క్రమంలో పాత నోటుకు ఎసరు పడుతుందనే దిగులు అవసరం లేదు.. పాతనోటు కూడా చలామణిలో వుంటుందని పేర్కొంది.