కూల్‌ప్యాడ్ మ‌రో స్మార్ట్‌ఫోన్‌

SMTV Desk 2017-08-21 12:00:41  Coolpad, play 6, Smartphones, Latest android phones, High Battery standby

ముంబై, ఆగస్ట్ 21: స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో తనదైన ముద్రవేసిన చైనా మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ కూల్‌ప్యాడ్ మ‌రో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ మొబైల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. కూల్ ప్లే 6 పేరుతో వస్తున్న ఈ మొబైల్‌ను ఈ ఏడాది ఆరంభంలోనే చైనాలో విడుదల చేశారు. అక్కడ మంచి ఆదరణ లభించిన తరుణంలో భారత్‌లో కూడా విడుదల చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఫోన్ యొక్క విశేషతలు... 1.4 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌తో పాటు 64జీబీ అంతర్గత మెమొరీ, 3 మెగా పిక్సెల్‌ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరాల‌తో పాటు 5.5 అంగుళాల ట‌చ్‌స్క్రీన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 7.1.1 ఆప‌రేటింగ్ సిస్టంతో ఇది ప‌నిచేయ‌నుంది. అయితే ఈ ఫోన్ ధర సుమారు రూ.14,000 ఉండనున్నట్లు సమాచారం.