మజిలీ కాంబో రిపీట్ అవుతుందా?

SMTV Desk 2019-04-27 11:50:45  Naga Chaitanya, Samantha

అక్కినేని నాగ చైతన్య మజిలి హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా చైతు కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

రామ్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరు దగ్గరకు వెళ్లొచ్చిన ఈ సినిమా ఫైనల్ గా అక్కినేని హీరో చెంత చేరింది. మహా సముద్రం అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో నాగ చైతన్య పోలీస్ పాత్రలో నటిస్తాడని తెలుస్తుంది. చైతు నటించిన తఢాఖా సినిమాలో పోలీస్ డ్రెస్ లో కనిపించాడు. అయితే అది సీరియస్ గా కాదు కాని మహాసముద్రంలో మాత్రం ఫుల్ లెంగ్త్ పోలీస్ రోల్ లో కనిపిస్తాడట. మరి చైతు కాప్ రోల్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.