అల్లాదిన్ కు డబ్బింగ్ చెప్పిన వెంకటేష్, వరుణ్..!

SMTV Desk 2019-04-27 11:49:35  varun Tej, Venkatesh

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎఫ్-2 అంటూ ఈ సంక్రాంతికి వచ్చి కడుపుబ్బా నవ్వించిన వెంకటేష్, వరుణ్ తేజ్ ల ద్వయం మరోసారి కలిసి ఓ సినిమాకు పనిచేశారు. ఎఫ్-2 తో వెంకటేష్, వరుణ్ తేజ్ లకు ఫుల్ క్రేజ్ రాగా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు హాలీవుడ్ సినిమా అల్లాదిన్ వారి చేత లీడ్ క్యారక్టర్స్ కు డబ్బింగ్ చెప్పించింది. వెంకటేస్జ్ జెని పాత్రకు డబ్బింగ్ చెప్పగా అల్లాదిన్ కు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పాడు.

ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. వెంకటేష్, వరుణ్ తేజ్ ల వాయిస్ ఉంది కాబట్టి త్వరగానే ఓన్ చేసుకునే అవకాశం ఉంది. మే 24న రిలీజ్ అవుతున్న అల్లాదిన్ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి డబ్బింగ్ చెప్పడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. మరి ఎఫ్-2 లానే అల్లాదిన్ కూడా తెలుగులో సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.