మొజాంబిక్ కు కెన్నిత్‌ బెడద

SMTV Desk 2019-04-26 18:36:59  mojambik, kennith tsunami

మొజాంబిక్: మొన్నటి వరకు ఇడాయ్ తుఫాన్ తో అతలాకుతలమయిన మొజాంబిక్ దేశాన్ని ఇప్పుడు కెన్నిత్‌ అనే మరో తుఫాన్ వణికిస్తుంది. దేశంలో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో భారీగా గాలులు వీస్తున్నాయి. ఈ తుపాన్ వల్ల 600 మిల్లీమీటర్ల వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలతో తీర ప్రాంతాల్లో ఉన్న ఐదు నదులు తెగిపోయి వరదనీరు జనవాసాలను ముంచెత్తింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు.. 30వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్ తోపాటు ఇతర అంతర్జాతీయ సహాయ సంస్థలు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి.