స్మగ్లర్లకు చిలుక సాయం...అరెస్ట్

SMTV Desk 2019-04-26 16:02:49  parrot helps drugs smugglers to escape police, Brazil

బ్రెజిల్: బ్రెజిల్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ స్మగ్లర్లకు సహాయం చేసిందని ఓ చిలుకను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల ప్రకారం... ఓ ఇంట్లో నుంచి నిందితులు భారీ ఎత్తున కొకైన్ ను స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో స్మగ్లర్లను పట్టుకోవాలని పోలీసులు పక్కా పథకం పన్నారు. వెంటనే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు వస్తున్న విషయం స్మగ్లర్లు పసిగట్టలేదు. అయితే గుమ్మం దగ్గర పంజరంలో ఉన్న చిలుక మాత్రం పోలీసుల రాకను పసిగట్టింది. ’ మమ్మా … పోలీసు…‘ అంటూ అరిచింది. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు వేరే ద్వారం ద్వారా పరారయ్యారు. చిలుక అరవడం వల్లనే స్మగ్లర్లు తప్పించుకున్నారని పోలీసులు నిర్ధారించారు. దీంతో చిలుకను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అనంతరం జరిగిన విచారణలో ఆ చిలుక నోరు విప్పలేదు. చిలుకను విడిచి పెట్టాలని పక్షి ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేయడంతో పోలీసులు సదరు చిలుకను స్థానికంగా ఉన్న జంతుప్రదర్శనశాలకు తరలించారు. ఎగిరేందుకు చిలుకకు శిక్షణ ఇచ్చి వదిలేస్తామని పోలీసులు తెలిపారు.