నీరవ్‌ మోడీ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు

SMTV Desk 2019-04-26 16:00:08  neerav modi, golden visa, Britain government, london high court, arrest warrant, cars, neerav modi cars sale

న్యూఢిల్లీ: ఇండియాలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుండి అప్పులు చేసి ఎగ్గొట్టి లండన్‌ జైల్లో ఊచలు లెక్కిస్తున్న వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ బెయిల్‌ పిటిషన్‌ ఇవాళ విచారణకు రానుంది. వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎమ్మా అర్బుథ్నాట్‌ ఈ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపనున్నారు. జైలులో ఉన్న నీరవ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి ఆయన వాదన విననున్నారు. అనంతరం నీరవ్ కు బెయిల్‌ ఇవ్వాలా, రిమాండ్‌ పొడిగించాలా అన్న విషయమై నిర్ణయం తీసుకోనున్నారు మెజిస్ర్టేట్‌.