సైంటిఫిక్ థ్రిల్లర్‌తో...డ్యూయల్ రోల్‌!

SMTV Desk 2019-04-26 15:56:19  raviteja, disko raja, vi anand, ss thaman, nabha natesh, payal rajput

హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా డిస్కో రాజా . ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్ మే మూడో వారం నుండి జరుగనుందని తెలిసింది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. యంగ్ బ్యూటీలు నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలుగా చేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కిస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.