రాజకీయాల్లోకి వచ్చే సమస్యే లేదు : రఘురామ్‌ రాజన్‌

SMTV Desk 2019-04-26 15:53:40  indian former governor, raghuram rajan

న్యూఢిల్లీ: భారత మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌ తాజాగా ఊ మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయరంగ ప్రవేశం గురించి స్పందిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....తానూ ఎట్టిపరిస్థితిలో రాజకీయాల్లోకి రాదలచుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తన సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వృత్తి పరంగా రఘురామ్‌ రాజన్‌ ఎన్నో ఉన్నత పదవులను అలంకరించారు. మంచి అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని, అయితే తాను మాత్రం రాజకీయాల్లోకి రానని ఆయన పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే, తన భార్య తనను వదిలేస్తుందని ఆయన చమత్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు అనే అంశం సర్వసాధారణమై పోయిందని ఆయన చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి వస్తుందన్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. ఈ ఊహాగానాలను తాను ఆపలేనని ఆయన పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉంటే, అక్కడ సంతోషంగా ఉండేలా చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.