మరింత క్షీణించిన రూపాయి విలువ!

SMTV Desk 2019-04-26 15:52:11  indian currency, rupee, trade, shares, america dollar value

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం ఇండియన్ రూపాయి విలువ మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే డాలరుతో రూపాయి మారకం విలువలు 70.10గా ట్రేడింగ్‌ జరిగి ఏడు వారాల తర్వాత అత్యంత క్షీణస్థాయికి చేరింది. ప్రారంభంలోనే 70.0163 వద్ద ట్రేడింగ్‌ కొనసాగి ఇప్పటివరకూ 69.92 నుంచి 70.10 వద్ద ట్రేడింగ్‌ జరుగి చివరకు మళ్లీ 70.03వద్దకు చేరింది. అమెరికా డాలర్‌ మరింతగా పటిష్టం కావడం,ముడిచమురుధరల రూపంలో భారత్‌ కరెన్సీపై విపరీతమైన ఒత్తిడి రావడమే ఇందుకు కీలకం. ఒకదశలో గడచిన అక్టోబరులోనే 74.48 కనిష్టస్థాయిని నమోదు చేసింది. ముడి చమురుధరలు పెరుగుదల, విదేశీపోర్టుఫోలియో నిధులు వెనక్కి తీసుకో వడం, అమెరికా డాలర్‌ పటిష్టం కావడం వంటి చర్యలు ఇందుకు కీలకం అయ్యాయి. బ్రెంట్‌ ముడిచమురుదరలు బ్యారెల్‌కు 75 డాలర్లుగా నడిచాయి. 2019లో మొదటిసారి ఈ ధరలు కొనసాగాయి. అమెరికా నిర్ణయాల అనుసరించి ఇరాన్‌ముడిచమురు కొనుగోళ్లను నిలిపివేయా లని, ఇరాన్‌ చేసే ముడిచమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ధరలుపెరిగాయి. ఒపెక్‌ ఉత్పత్తి కోత కొంతమేర ధరల పెరుగుదలకు నాందిపలికింది. బ్యారెల్‌కు 75 డాల ర్లుగా ఉన్న ధరలు మరింతపెరగవచ్చని