74 వేలమంది హిజ్రాలు అరెస్ట్!

SMTV Desk 2019-04-26 15:05:04  hijras, transgenders, transgenders arrest in rpf

న్యూఢిల్లీ: రైల్లో ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్న హిజ్రాలు, ట్రాన్స్ జెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ, వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్న సుమారు 74వేల మంది హిజ్రాలను అరెస్ట్ చేసినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత నాలుగేళ్లలో 73,837 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. ఓ ఆర్డీఐ దరఖాస్తుదారుడికి ఇచ్చిన సమాధానంలో ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఈ లెఖ్ఖన రోజుకు 50 మందిని అరెస్ట్ చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ వారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 2015 నుంచి 2019 జనవరి వరకు సేకరించిన డేటాను రైల్వే అధికారులు ఆర్టీఐ దరఖాస్తుదారుడికి వివరించారు.