‌ఆర్‌టిసి బస్సు చోరీ....చివరికి ఇలా దొరికింది!

SMTV Desk 2019-04-26 12:56:39  tsrtc, tsrtc buss theft in hyderabad, cbs bustand

హైదరాబాద్: తాజాగా చోరీకి గురైన టిఎస్‌ఆర్‌టిసికి చెందిన బస్సు చివరకి నామరూపాల్లేకుండా కనిపించింది. దొంగలు దీన్ని మహారాష్ట్రలోని నాందేడ్‌కు పట్టుకెళ్లి ఏ పార్టుకు ఆ పార్టీ ఊడబీకి కంకాళాన్ని మాత్రమే మిగిల్చారు.హైదరాబాద్ కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో (ఏపీ11జెడ్‌ 6254) బస్సు రోజూ కుషాయిగూడ – అఫ్జల్‌గంజ్‌ మధ్య తిరిగేది. దీన్ని మంగళవారం రాత్రి 11.02 గంటలకు అఖరి ట్రిప్‌ తర్వాత డ్రైవర్, కండక్టర్ సీబీఎస్‌ డిపో-1లో నిలిపి, విశ్రాంతి గదిలోకి వెళ్లి నిద్రపోయారు. బుధవారం పొద్దులేచి చూసేసరికి గల్లంతైంది. పై అధికారులకు ఫిర్యాదు చేశారు. సీసీఫుటేజీల సాయంతో బస్సు నాందేడ్‌లో ఉన్నట్లు గుర్తించారు. బస్సును పూర్తిగా విప్పదీసి కీలక భాగాలన్నీ ఎత్తుకుపోయారు. దొంగల కోసం వేట సాగుతోంది.