ఇంటర్ రీ-కౌంటింగ్ సెంటర్లు

SMTV Desk 2019-04-26 12:17:02  inter recouting

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది విద్యార్దుల పరీక్షా పత్రాలను మళ్ళీ రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో ఇంటర్ బోర్డు అందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లో 7 జూనియర్ కాలేజీలు, మేడ్చల్ డీఈఓ ఆఫీసులో రీ-కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

1. నాంపల్లి ఎంఏఎం జూనియర్ కాలేజీ.

2. కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ

3. గన్‌ఫౌండ్రీ మహబూబియా జూనియర్‌ కాలేజీ

4. ఫలక్‌నుమా ప్రభుత్వ జూనియర్ కాలేజీ

5. హయత్‌నగర్‌ కాలేజీ

6. కూకట్‌పల్లి జూనియర్ కాలేజీలో సెంటర్లు

7. శంషాబాద్‌ ప్రభుత్వ జూనియర్ కాలేజీ

8. మేడ్చల్‌ డీఈవో ఆఫీస్‌

రెండుమూడు రోజులలోనే ఈ కేంద్రాలలో-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ కార్యక్రమం మొదలు పెట్టి మే15వ తేదీ కల్లా మళ్ళీ ఇంటర్ విద్యార్దులకు మార్క్స్ మెమోలు అందజేస్తామని ఇంటర్ బోర్డు బాద్యతలు స్వీకరించిన జనార్ధన్ రెడ్డి తెలిపారు.