కార్యాలయాల మూసివేతపై పవన్ కామెంట్స్

SMTV Desk 2019-04-26 12:06:12  janasena, pawan kalyan, janasena party offices closed in andhrapradesh

అమరావతి: ఏపీలో జనసేన కార్యాలయాలు మూసివేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.... నియోజకవర్గాల్లోని జనసేన పార్టీ కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. అలాగే జనసేన శ్రేణులంతా సమాజంలో మంచి మార్పు రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కానీ తన కార్యాచరణ వెల్లడించలేదు. ఇక ఏపీలో ఎన్నికల తర్వాత జనసేన కాస్త సైలెంట్ అయిపొయింది. టిడిపి, వైసీపీ లా ప్రచారాలు చేసుకుంటూ ఎక్కడ కనిపించడంలేదు. కేవలం పార్టీ కార్యాలయాల్లో తప్ప ఎక్కడా ఎటువంటి మీటింగ్ లు లేవు.