అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఉపాధ్య‌క్షుడు పోటీ

SMTV Desk 2019-04-25 19:15:59  america, america president elections 2020, Joseph Baiden

వాషింగ్టన్: 2020లో జరిగే దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అమెరికా మాజీ ఉపాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్‌ పోటీ చేయనున్నట్లు ఆయన తన ట్వీట్టర్ ద్వారా తెలిపారు. అమెరికాను తీర్చిదిద్దిన విలువ‌లు, ప్ర‌జాస్వామ్యం, అన్నీ ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని జోసెఫ్ బైడెన్ పేర్కొన్నారు. 76 సంవత్సరాల డెమోక్ర‌టిక్ పార్టీ నేత అయిన బైడెన్‌… ఒబామా హయాంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ఇప్ప‌టికే 19 మంది త‌మ అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించారు. దాంట్లో సేనేట‌ర్లు ఎలిజ‌బెత్ వారెన్‌, క‌మ‌లా హారిస్‌, బెర్నీ శాండ‌ర్స్ తదితరులు ఉన్నారు.