మేం ఎలా ఆడామన్నది మాకు తెలుసు: కోహ్లీ

SMTV Desk 2019-04-25 19:14:30  ipl 2019, rcb vs kxip, virat kohli

బుధవారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టుపై బెంగళూరు జట్టు ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ‘వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడటం మమ్మల్ని ఎంతో బాధించింది. కానీ, మా ఆటగాళ్లు ఎవరూ ఆ ఒత్తిడిలో కుంగిపోలేదు. ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాం. మేం ఎలా ఆడామన్నది మాకు తెలుసు. ప్రపంచానికి కూడా తెలుసు. జట్టుగా ఆడటం మంచి ఫలితాలను తెచ్చి పెడుతుందని మేం నమ్మాం. క్రికెట్‌ను ఎంత ఆస్వాదిస్తూ ఆడితే అంత ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు మ్యాచ్‌లో మా జట్టు ఆటతీరే అందుకు ఉదాహరణ. స్టొయినీస్‌, డివిలియర్స్‌ కలిసి మ్యాచ్‌కు మంచి పునాది వేశారు. 175 పరుగుల లక్ష్యం నిర్దేశించగలిగితే చాలు అనుకున్న సమయంలో వాళ్లిద్దరూ చక్కటి భాగస్వామ్యంతో 200 పరుగుల మైలురాయి దాటించారు. ఈ విజయంలో కీలక పాత్ర వాళ్లదే’ అని కోహ్లీ పేర్కొన్నాడు.