లోకేష్ మళ్ళీ నోరు జారాడు

SMTV Desk 2019-04-25 18:00:52  nara lokesh, andhrapradesh elections, ysrcp mp, vijayasai reddy, tdp minister

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ మరోసారి నోరు జారాడు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు లోకేష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్లో వైరల్ అయ్యాయి. లోకేష్ మీడియాతో మాట్లాడుతూ...భారతదేశంలో మొత్తం 900 లోక్ సభ స్తానలున్నాయని అన్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు లోకేష్ వీడియోను ట్రోల్ చేస్తున్నారు. దేశంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియదా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. 545 స్థానాలుంటే ఏకంగా 900 చేశారా.. శ్రీకలం, పాకిస్థాన్‌వి కూడా కలిపావా ఏంటి అంటూ సెటైర్లు పేల్చారు. ఇదిలా ఉంటె వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా దీనిపై ఓ ట్వీట్ చేశాడు. ‘పప్పు మళ్లీ ఇరుక్కున్నాడు. దేశంలో 900 లోక్ సభ స్థానాలున్నాయంట. మంగళగిరిలో 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరినట్లే ఉంది. తండ్రేమో రష్యన్ హ్యాకర్లు ఈవీఎంల ఫలితాలను మారుస్తారని గోల చేస్తున్నారు. ఇద్దరూ రాష్ట్రం పరువు మంట గలుపుతున్నారు. పప్పు, తుప్పులను గొలుసులతో కట్టేయాలేమో?’అన్నారు విజయసాయి రెడ్డి.