అమ్మకాల్లో నీరవ్ మోదీ కార్లు

SMTV Desk 2019-04-25 17:58:08  neerav modi, golden visa, Britain government, london high court, arrest warrant, cars, neerav modi cars sale

న్యూఢిల్లీ: భారత్ లో అనేక అప్పులు చేసి లండన్ కి వెళ్ళిన నీరవ్ మోదీ కార్లను వేలం పాటుకు పెట్టారు. వాటిలో రూ. 5 కోట్ల విలువైన రోల్స్‌ రాయిస్‌ కారు కేవలం రూ 1.3 కోట్లకే అందిస్తున్నారు. నీరవ్ కార్లలో ఇదొకటి. 13 కార్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆన్‌లైన్‌ వేలంలో అమ్మనుంది. వీటిలో రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌, పోర్షే పనమెరా, రెండు మెర్సిడెస్‌ బెంజ్‌, టొయోటా ఫార్చూనర్‌, ఇన్నోవా, రెండు హోండా బ్రియోస్‌ వంటివి ఉన్నాయి. రెడ్ మెర్సిడెస్ బెంజి కారు రూ. 14 లక్షలు, వైట్ బెజ్ రూ. 37.8 లక్షలు, బీఎండబ్ల్యూ రూ.9.8 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. కొనే ఆసక్తి ఉన్న వాళ్లు నెల 21 నుంచి 23 వరకూ ఆయా కార్లను స్వయంగా చూసి చెక్ చేసుకోవచ్చు కూడా. అయితే టెస్ట్‌ డ్రైవ్‌ మాత్రం ఉండదు. ఈకార్ల ఫోటోలను మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సైట్‌లో ఉంచారు. నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.