గుండెపోటుతో తుది శ్వాస విడిచిన మాజీ ఐఏఎస్ అధికారి

SMTV Desk 2017-08-21 09:41:43  EX. IAS PVRK PRASAD, DIED, CARE HOSPITAL,

హైదరాబాద్, ఆగస్ట్ 21 : మాజీ ఐఏఎస్ అధికారి, రచయిత పీవీఆర్‌కే ప్రసాద్‌ హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండెపోటూ కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. పీవీఆర్‌కే గతంలో తిరుమల దేవస్థాన కార్య నిర్వాహణ అధికారిగా పని చేయడమే కాకుండా రచయితగా పలు పుస్తకాలను రచించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సలహాదారుడిగా కూడా ఆయనకు అనుభవం ఉంది. పీవీఆర్కే మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఉదయం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్య‌క్రియ‌లు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.