విద్యార్థులకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్

SMTV Desk 2019-04-25 15:46:25  uttam kumar redy, kcr

హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్ బోర్డు ఫలితాల తప్పిదాలపై రాష్ట్ర ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు, ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యాయని, విద్యార్థులవి ఆత్మహత్యలు కావు, ప్రభుత్వ హత్యలు అని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ సమాజానికి సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇంటర్ బోర్డు తీరుతో లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురయ్యారని ఉత్తమ్ వాపోయారు. ఇంటర్ ఫలితాలే టీఆర్ఎస్ పాలనకు నిదర్శనం అని విమర్శించారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకు దిగింది. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధర్నా చేశారు.