పవనే సీఎం!

SMTV Desk 2019-04-25 15:44:22  bandla ganesh, pawan kalyan, janasena, congress party, telangana assembly elections

అమరావతి: సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రాజకీయ ప్రవేశం చేసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోం పరాజయపాలైన తరువాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా రాజకీయాలపై స్పందిస్తూనే ఉన్నారు. తన అభిమాన హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి, సీఎం అవుతారని జోస్యం చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్కంటే ధీమాతో చెప్పడం ఆసక్తికరంగా మారింది.‘పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ఎన్నిక ఫలితాలు వచ్చాక ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది. కొందరు ఏవో అంటారు, పట్టించుకోలేదు. మన పక్క రాష్ట్రమైన కర్ణాటకను తీసుకుందా. జేడీఎస్ నేత కుమారస్వామికి అందరికంటే తక్కువ సీట్లు వచ్చినా సీఎం అయ్యాడు. పవన్ కల్యాణ్ కూడా అవవుతారు. ఆయన ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చాడు. అందులో చాలా సినిమాలు చూపిస్తారు. ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నా.. చిరంజీవి కెమెరా ముందు బాగా నటిస్తారుగాని, నిజ జీవితంలో నటించలేరు. రాజకీయాలు ఆయనకు పడవు. నేను కూడా అందుకు తప్పుకున్నాను. ఇకపై సినిమాలే నా జీవితం’ అని అన్నారు.