కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

SMTV Desk 2019-04-25 13:25:01  Konda vishweshar reddy, rahul gandhi, advocate arrest, nampally high court

హైదరాబాద్: నాంపల్లి హైకోర్టులో కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి చుక్కెదురైంది. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్బంధించి, ఆపై వేధించారంటూ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు గచ్చిబౌలిలో తనిఖీలలో దొరికిన రూ.10 లక్షల నగదుకు సంబంధించిన కేసులో విశ్వేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఎస్‌ఐ కృష్ణ తన సిబ్బందితో ఆయన కార్యాలయానికి వెళ్లగా కొండా తన సిబ్బందితో ఎస్‌ఐ కృష్ణను ఒక గదిలో నిర్భందించారు. అంతటితో ఆగకుండా ఎస్‌ఐ కృష్ణను పరుష పదజాలంతో దూషించి విధులకు ఆటంకం కల్పించడంతో పాటు తన సిబ్బందితో కలిసి విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై దౌర్జన్యం చేశారని కేసు పెట్టారు. దీంతో గత వారం రోజులుగా కొండా కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే అప్రమత్తమైన కొండా ఈ నెల 22వ తేదీన నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించిన నాంపల్లి కోర్టు… ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అలాగే కొండా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.