మహిళా ఎంఎల్ఎ డ్యాన్స్....వీడియో వైరల్

SMTV Desk 2019-04-25 13:18:48  ysrcp mla pushpavani, pushpavani dance video viral

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో కురుపాం నియోజకవర్గంలో వైసిపి ఎంఎల్‌ఎ పుష్పవాణి తన కార్యకర్తలతో కలిసి చిందులేశారు. గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను సాంగ్‌కు అనందం పట్టలేక తన అనుచరులతో కలిసి డ్యాన్స్ చేసి కార్యకర్తలలో జోష్ నింపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఎంఎల్ఎ డ్యాన్స్ పై కామెంట్లు చేశారు. శ్రీవాణి అక్క డ్యాన్స్ సూపర్ గా ఉందని, ఫ్యాన్ గాలికి జనసేన, టిడిపి పారిపోవాలని చై చైతన్య నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఫ్యాన్ గిరగిర తిరుగుతుంటే గాలికి గ్లాస్ ఊగుతుంది, చంద్ర బాబు మతి పోతుందని నెటిజన్లు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే శ్రీవాణి మంత్రి అవుతారని వైసిపి ప్యాన్స్ కామెంట్లు చేశారు.