మోదీ పై నటుడు సిద్దార్థ్ సెటైరికల్ ట్వీట్

SMTV Desk 2019-04-25 13:16:38  Siddarth, Tweet, Modi,

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే .. ఎన్నికల వేళ అక్షయ్ ఇలా మోదీని ఇంటర్వ్యూ చేయడంతో ఎక్కువ క్రేజ్ వచ్చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూపై కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ కౌంటర్ ట్వీట్ చేశాడు.

‘అక్షయ్ కుమార్ ఒక విలన్.. ఆయనను తక్కువ అంచనా వేశాం’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై చాలా మంది యూజర్లు స్పందిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తన అసంతృప్తిని ఈ ట్వీట్ ద్వారా తెలియజేశారంటూ మోడీని వ్యతిరేకించే వర్గం సిద్దార్థ్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కొందరు సిద్ధార్థ్‌ను విమర్శిస్తున్నారు.

ఎన్నికల సందర్భంగా మోడీని రెండోసారి ప్రధానిని చేసేందుకు అక్షయ్ కుమార్ తనవంతు సాయం చేస్తున్నారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు. ఇదిలావుండగా ప్రధాని ముందు కాలు మీద కాలు వేసుకుని అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేయడాన్ని తప్పుబడుతున్నారు మోడీ అభిమానులు. దేశ ప్రధానికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.