నాబార్డ్, ఎన్‌హెచ్‌బి షేర్లను సర్కార్ కు విక్రయించిన ఆర్‌బిఐ

SMTV Desk 2019-04-25 13:04:48  reserve bank of india, rbi, nabard, nhb, nabard and nhb shares sales to government

ముంబై: నాబార్డ్, ఎన్‌హెచ్‌బి రెండు సంస్థల్లో ఉన్న అన్ని షేర్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి విక్రయించింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బి) వాటాలను రూ.1,450 కోట్లకు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్)లో వాటాలను రూ.20 కోట్లకు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) అమ్మేసింది. మార్చి 19న ఎన్‌హెచ్‌బిలోని వాటాలను, ఫిబ్రవరి 26న నాబార్డులోని వాటాలను విక్రయించినట్టు బుధవారం సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండు ఆర్థిక సంస్థల్లో 100 శాతం వాటాలను చేజిక్కించుకుందని ఆర్‌బిఐ వెల్లడించింది. నరసింహం కమిటీ రెండో నివేదిక సిఫారసులపై ఈ పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టామని బ్యాంక్ తెలిపింది.