సర్కార్ సోమ్ముకే భద్రత కరువు....టిఎస్‌ఆర్‌టిసి బస్సు చోరీ

SMTV Desk 2019-04-25 13:01:52  tsrtc, tsrtc buss theft in hyderabad, cbs bustand

హైదరాబాద్: ప్రభుత్వ సొమ్ముకే భద్రత లేకుండా పోయింది...ఇంకా మనకేం భద్రత ఉంటుంది. ఇటువంటి సంఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. టిఎస్‌ఆర్‌టిసికి చెందిన సర్కార్ బస్సు చోరీకి గురైంది. ఈనెల 23వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో బస్సును సిబిఎస్ బస్టాండ్ లో డ్రైవర్ పార్కింగ్ చేశాడు. అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లి, మరుసటి రోజు బస్టాండ్ కు వచ్చాడు. బస్టాండ్ లో బస్సు కనిపించకపోవడంమతో అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్షణ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే బస్సు చోరీకి గురైందని పోలీసులు నిర్థారించారు. సిసి కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. చోరీకి గురైన బస్సు రాత్రి ఒంటిగంట సమయంలో తూప్రాన్ టోల్ గేటను దాటినట్టు గుర్తించారు. చోరీకి గురైన బస్సు మహారాష్ట్రలోని నాందేడ్ వైపు వెళ్లిందని, బస్సు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.