మొదటి ప్రయత్నంలోనే ఆరవ ర్యాంకు

SMTV Desk 2017-06-02 18:18:00  dinesh, sivils,

విజయవాడ, జూన్ 2 : విజయవాడ వన్ టౌన్ కు చెందిన కొత్తమాసు దినేష్ కుమార్ (24) మొదటి ప్రయత్నం లోనే సివిల్స్ లో ఆరవ ర్యాంక్ సాధించి తన సత్తా చాటారు. దినేష్ కుమార్ తండ్రి శ్రీనివాస్ రావు వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. తల్లి రాధాకుమారి గృహిణి. దినేష్ వరంగల్ లో ఎన్ఐటీ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. అనంతరం భారత్ పెట్రోలియం ఉద్యోగం లో చేరాడు. కానీ దినేష్ కు ఏవేమి నచ్చలేదు. చిన్నతనం నుంచి సమాజానికి తనవంతుగా ఏదైనా సేవ చేయాలనీ భావించాడు. అందుకే పెట్రోలింగ్ ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగాలేకపోయాడు. దినేష్ అభిమానించే జయప్రకాశ్ నారాయణ, ముత్యాల రాజులు వారిలా ఐఏఎస్ చదవాలని నిర్ణయించుకొని సంవత్సరం తరువాత ఉద్యోగం వదిలేసాడు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడం తో వారు ఒప్పుకున్నారు. దీంతో డిల్లీ వెళ్లి అక్కడ వజీరాం అండ్ రవి ఇన్ స్టిట్యుట్ లో సంవత్సరం పాటు శిక్షణ తీసుకున్నారు. సివిల్స్ రాసి మొదటి ప్రయత్నం లోనే ఆరోవ ర్యాంక్ సాధించారు. సమజంలో ఆర్థిక అసమానతలు తొలిగి అందరికి విద్య, వైద్యం అందించాలని తన లక్ష్యమని దినేష్ చెప్పాడు.