‘బాహుబలి’ రేంజ్ లో అవెంజర్స్

SMTV Desk 2019-04-25 11:24:39  Avengers, Baahubali

ఇటీవలి కాలంలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ ‘బాహుబలి’ మాత్రమే.రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ పై భారీ అంచనాలుండటంతో మొదటి రోజు షో చూసేందుకు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపించారు. హైదరాబాద్ లో మొదటి రోజు మాత్రమే కాకుండా వీకెండ్ వరకు టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. సిటీ సెంటర్లో ఉన్న ఐమాక్స్ దగ్గర ఈ సినిమా విడుదల సమయంలో భారీ క్రేజ్ ఏర్పడింది . ఆన్ లైన్ లో టిక్కెట్లు లేకపోవడంతో అభిమానులంతా ఐమాక్స్ కు క్యూ కట్టారు. దీంతో కిలో మీటరు వరకు పెద్ద క్యూ ఏర్పడింది. ఇది అప్పట్లో ఓ సంచలనం.మళ్లీ ఆ తర్వాత ఏ మూవీకి అంతటి స్పందన రాలేదు. అయితే ఇప్పుడు శుక్రవారం రిలీజ్ అవుతున్న ‘అవెంజర్స్’కు బాహుబలి స్థాయిలో కాకపోయినా ఐమాక్స్ దగ్గర బుధవారం ఉదయం భారీ క్యూనే కనిపించింది. యూత్ కౌంటర్ దగ్గర టికెట్ల కోసం ఉదయం 6 గంటలకే వచ్చి లైన్‌ లో బారులు తీరారు.