లాభాలతో పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్

SMTV Desk 2019-04-24 19:09:14  Sensex, Nifty, Stock market, Share markets

ముంభై: బుధవారం ఇండియన్ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ ఏకంగా 490 పాయింట్లు జంప్ చేసి 39,055 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 11,726 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఎనర్జీ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు కారణంగా ఇండెక్స్‌లు భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ షేర్లు 1.5 నుంచి 2.2 శాతం శ్రేణిలో పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కూడా మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది. మార్కెట్ చివరి గంటలో బాగా ర్యాలీ చేసింది. నిఫ్టీ 50లో అల్ట్రాటెక్ సిమెంట్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఐఓసీ, యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఏకంగా 6 శాతం మేర పరుగులు పెట్టింది. ఆయిల్ రంగ షేర్లు కూడా లాభపడ్డాయి. అదేసమయంలో టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, మారుతీ సుజుకీ, సిప్లా, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్ 3 శాతానికి పైగా నష్టపోయింది.సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ముగిశాయి. అయితే ఒక్క నిఫ్టీ ఆటో ఇండెక్స్ మాత్రం నష్టాల్లోనే ఉండిపోయింది. బ్యాంక్ షేర్లు కళకళలాడాయి. ఐటీ షేర్లు కూడా దూసుకెళ్లాయి.