ఎన్టీఆర్ కు గాయాలు

SMTV Desk 2019-04-24 17:21:34  ntr, ram charan, rajamouli, rrr, ntr injured

హైదరాబాద్: దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ తో మల్టీ స్టారర్ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పూణెలో జరిగిన షూటింగ్ లో రాంచరణ్ కాలుకి ప్రమాదం జరిగింది. దీంతో నెల రోజుల పాటు షూటింగ్ ను వాయిదా వేశారు. షూటింగ్ లో భాగంగా తీస్తున్న యాక్షన్ సన్నివేశాల్లో ఎన్ టిఆర్ గాయపడ్డారు. ఆయన కుడి చేతికి గాయమైన ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే ఇది స్వల్ప గాయమేనని, కంగారు పడాల్సిన అవసరం లేదని సినిమా వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగినప్పటికీ, ప్రథమ చికిత్స అనంతరం ఎన్ టిఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు సినిమా యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఎన్ టిఆర్ కు అయిన గాయం మానిన తరువాతనే యాక్షన్ సీన్లు తీయనున్నట్టు తెలుస్తోంది.