అలా చేస్తే వచ్చే ఐపీఎల్‌ లో నన్ను చెన్నై తీసుకోదు: ధోని

SMTV Desk 2019-04-24 17:12:25  ipl 2019, mahendra singh dhoni, shane watson, srh vs csk

మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుపై చెన్నై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మీడియాతో షేన్‌ వాట్సన్‌ గురించి మాట్లాడాడు. గత మ్యాచుల్లో రాణించకలేకపోయినా సరే అతను నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూనే ఉన్నాడు. బంతిని అంచనా వేయడంలో వాట్సన్‌కు కచ్చితత్వం ఉంటుంది. అందుకే జట్టు యాజమాన్యం అతినికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించిందకని చెప్పుకొచ్చారు. చెన్నై జట్టు విజయ రహస్యం ఏంటని వ్యాఖ్యాత హర్షబోగ్లే ప్రశ్నించగా. కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఫన్నీగా సమాధానమిచ్చాడు. ఒకవేళ అందరికీ ఆ రహస్యాన్ని చెబితే.. వచ్చే ఐపీఎల్‌ వేలంలో చెన్నై యాజమాన్యం తనను కొనుగోలు చేయదని ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.