తమిళనాడుకు ముప్పు!!

SMTV Desk 2019-04-24 15:26:48  tamilanadu state, chennai whether report

చెన్నై: తమిళనాడు రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని చెన్నై వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మధ్య ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని అంటున్నారు. ఈ వాయుగుండం బలోపేతమై చెన్నై వైపు పయనిస్తుందని, దీని ప్రబావం తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలపై ఉంటుందన్నారు. రెండు రాష్ర్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయంటున్న అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారి హెచ్చరించారు.