వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

SMTV Desk 2019-04-24 12:13:49  Chandrababu, Inter board, AP CM

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి. బోర్డు తప్పిదాల కారణంగా పరీక్షలు బాగా రాసినప్పటికీ తాము ఫెయిలయ్యారు విద్యార్థులు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు. తెలంగాణలో 16 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెలువడుతున్న వార్తలు బాధించాయని ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల మరణం కలిచివేసిందని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యమని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండని హితబోధ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మార్కులను వెల్లడించడంలో ఇంటర్ బోర్డు తప్పిదాలు చేసిందని, బోర్డు వైఫల్యాల వల్లే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన చేస్తున్న తరుణంలో చంద్రబాబు ఇంటర్ బోర్డు వైఫల్యాల అంశాన్ని ప్రస్తావించక పోవడం.