వినయ్ వర్మ అరెస్ట్ ... నిర్భయ చట్టం కింద కేసు నమోదు

SMTV Desk 2019-04-24 12:12:39  Vinay Varma, Nirbhaya Chattam,

దాదాపు 30 ఏళ్లుగా సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ నడిపిస్తూ పలు తెలుగు, హింది సినిమాల్లో నటిస్తున్న వినయ్ వర్మ ఈమధ్య తన దగ్గరకు వచ్చిన ఓ అమ్మాయికి యాక్టింగ్ నేర్పించాలి అంటే బట్టలిప్పాల్సిందే అంటూ కండీషన్ పెట్టగా ఆమె అందుకు ఒప్పుకోలేదు. అంతేకాదు ఆమెను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడట. ఈ ఘటనపై బాధితురాలు వినయ్ వర్మ మీద నారాయణ గూడలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

కేసు నమోదు చేసిన అనంతరం వినయ్ వర్మను ప్రశ్నించిన పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. వినయ్ వర్మ మీద నిర్భయ చట్టంతో పాటుగా మరి కొన్ని సెక్షన్స్ లో కేసులు నమోదు చేశారు. వినయ్ వర్మ అరెస్ట్ సిని వర్గాల్లో చర్చలకు దారితీసింది.