రూ. 12,600 నష్టానికి రూ. 27,350 ఎందుకు చెల్లించాలి?

SMTV Desk 2017-08-20 14:26:56  South railway, Rat, Consumers forum, Railway police

చెన్నై, ఆగస్ట్ 20: కేరళలోని అలప్పుళ నుంచి చెన్నైకి 2 టైర్ ఏసీ బోగీలో దేవదాస్ అనే వ్యక్తి ప్రయాణం చేస్తున్న సమయంలో తన సూట్ కేసును ఎలుక ధ్వంసం చేసింది. అయితే బాధితుడు చెన్నై వెళ్లిన తరువాత ఈ విషయాన్ని గమనించి, అతను రూ. 12,600 పెట్టి కొనుగోలు చేసిన సూట్ కేసును ఓ ఎలుక కొరికేసిందని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఫోటో తీసి పై అధికారులకు పంపించాలి అని వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో దేవదాస్ వెంటనే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా తనకు నష్టం వాటిల్లిందని అతను ఫోరమ్ దగ్గర వాదించాడు. కేసును విచారించిన ఫోరమ్, దక్షిణ రైల్వే అధికారుల పర్యవేక్షణాలోపం కారణంగానే ఇలా జరిగిందని తేల్చింది. దీంతో రూ. 27,350ని నష్ట పరిహారంగా బాధితుడికి ఇవ్వాలని వినియోగదారుల ఫోరమ్ తీర్పిచ్చింది.