నన్ను ఎప్పుడో డ్రెస్సింగ్‌ రూమ్‌కి పరిమితం చేసేవారు : వాట్సన్

SMTV Desk 2019-04-24 12:10:17  Shane Watson, chennai super kings, ipl 2019, csk vs srh

చెన్నై: మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు షేన్‌ వాట్సన్‌ కీలక పాత్ర పోషించి హైదరాబాద్ ఫై ఘన విజయం అందించాడు. మ్యాచ్ అనంతరం వాట్సన్ మీడియాతో మాట్లాడుతూ....కింగ్స్‌ తప్ప వేరే జట్టులో ఉండి ఉంటే తనను ఎప్పుడో డ్రెస్సింగ్‌ రూమ్‌కి పరిమితం చేసేవారని అన్నాడు. వరుస మ్యాచుల్లో విఫలమైనా తనకు చెన్నై అవకాశాలు ఇచ్చిందని, వేరే జట్టులో ఉండి ఉంటే ఇన్ని అవకాశాలు వచ్చేవి కావని వాట్సన్‌ పేర్కొన్నాడు. చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, కెప్టెన్‌ ధోని నామీద ఎంతో నమ్మకం ఉంచారు. నేను జట్టుకు ఇంకా ఎన్నో పరుగులు బాకీ ఉన్నాను. గతంలో బీబీఎల్‌, పీఎస్‌లోనూ రాణించాను. కానీ, ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం నుంచి అంచనాలు అందుకోలేకపోయాను. అయితే, జట్టు నామీద నమ్మకం ఉంచింనందుకు ఆ జట్టుకు రుణపడి ఉంటాను అని వాట్సన్‌ పేర్కొన్నాడు.