మహేష్ కొత్త మూవీ లో విలన్ ఎవరో తెలుసా ?

SMTV Desk 2019-04-24 12:08:58  Mahesh, Jaggu Bhai

హీరోగా కెరియర్ పూర్తవడంతో విలన్ గా కొత్త టర్న్ తీసుకున్న జగపతి బాబు వరుస క్రేజీ ఛాన్సులు అందుకుంటున్నాడు. లెజెండ్ సినిమాతో విలన్ గా టర్న్ తీసుకున్న జగ్గు భాయ్ అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా బిజీ అయ్యాడు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. తెలుగులో జగపతి బాబుకి అవకాశాల వెళ్లువ కొనసాగుతూనే ఉంది.

ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాలో నటిస్తున్న జగపతి బాబు ఆ తర్వాత రాబోతున్న అనీల్ రావిపుడి సినిమాలో కూడా నటిస్తున్నాడట. ఆ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. శ్రీమంతుడు సినిమాలో జగపతి బాబు మహేష్ తండ్రిగా నటించాడు మహర్షి లోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అనీల్ రావిపుడి సినిమాలో మాత్రం విలన్ గా చేస్తున్నాడట. ఈ సినిమాలో విజయశాంతి, బండ్ల గణేష్ కూడా నటిస్తారని తెలుస్తుంది.