బిజెపి తీర్థం పుచ్చుకున్న సన్నీడియోల్‌

SMTV Desk 2019-04-23 18:25:47  sunnydeol, bjp, loksabha elections, bollywood actor

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు సన్నీడియోల్‌ తాజాగా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, నిర్మలా సీతారామన్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో దేశభక్తి సినిమాల్లో నటించిన సన్నీడియోల్‌.. దేశ భవిష్యత్‌ కోసమే బీజేపీలో చేరినట్టు తెలిపారు. తండ్రి ధర్మేంద్ర నడిచిన బాటలోనే తాను నడుస్తాను అన్నారు. ఇప్పటికే తల్లి హేమమాలిని బీజేపీలో ఉండగా తాజాగా కొడుకు చేరారు. ఇక సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్టు జావేద్ హబీబ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గడచిన ఐదేళ్లలో మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు జావేద్‌.