రజనీకాంత్ 167 చిత్రం లో జాయిన్ అయిన నయనతార

SMTV Desk 2019-04-23 17:13:44  Rajinikanth, Nayanatara

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 167 చిత్రం ‘దర్భార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిదే. ఇందులో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తొలి షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. ఇవాళే నయన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. నయనతార, రజనీకాంత్ లపై ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో రజనీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కతోన్న ఈ సినిమాలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.