తెలంగాణ ఐఎఎస్‌ ఐపిఎస్‌లకు ప్రమోషన్స్

SMTV Desk 2019-04-23 17:10:58  telangana state government, telangana ias, telangana ips, ias ips promotions

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 26 మంది ఐఎఎస్‌, 23 మంది ఐపిఎస్‌లకు ప్రమోషన్ కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు ఐఎఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా, ఒకరికి ముఖ్య కార్యదర్శి, నలుగురికి కార్యదర్శులుగా, మరో ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా, ఐదుగురు ఐఎఎస్‌లకు సంయుక్త కార్యదర్శులుగా, నలుగురు ఐఎఎస్‌లకు డిప్యూటీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించారు. అదేవిధంగా ఐదుగురు ఐపిఎస్‌లకు అదనపు డిజిలుగా, నలుగురు ఐపిఎస్‌లకు ఐజిలుగా, మరో ఏడుగురు ఐపిఎస్‌లకు డిఐజిలుగా, ఆరుగురు ఐపిఎస్‌లకు సీనియర్‌ స్కేల్‌ అధికారులుగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక అధికారికి ఐజిగా ప్రమోషన్ కల్పించారు. ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణ ప్రభుత్వం వీరికి ప్రమోషన్లు కలిపించింది.