జపాన్ అభిమానుల నుంచి రామ్ చరణ్‌కు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్..

SMTV Desk 2019-04-23 17:04:31  Japan, Ram charan

మార్చి 27న 34వ బ‌ర్త్‌డే జరుపుకున్న మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు జ‌పాన్ ఫ్యాన్స్ స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ జ‌పాన్ నుంచి కొంద‌రు అభిమానులు బ‌ర్త్‌డే గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్ పంపించారు. చరణ్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మ‌గ‌ధీర‌’ సినిమాలోని పాత్ర‌లను గ్రీటింగ్ కార్డుల‌పై చిత్రించి పంపారు. సుమారు 40 నుంచి 50 మంది వరకు ఇలా చరణ్ పై తమ ప్రేమ‌ను చాటుకున్నారు. ఆ గ్రీటింగ్ కార్డుల‌ను చెర్రీ త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి వారికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. త్వ‌ర‌లోనే వారిని క‌లుస్తాన‌ని చెప్పాడు. “జ‌పాన్ నుంచి స్వీట్ స‌ర్‌ప్రైజ్ అందింది. నా ప‌ట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదాలు. త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని కలుస్తాన‌ని ఆశిస్తున్నా. థాంక్యూ జ‌పాన్” అంటూ చెర్రీ ఎఫ్ బిలో పోస్ట్ చేశారు. ఇక ప‌వ‌ర్‌స్టార్ ‘మ‌గ‌ధీర‌’ మూవీ జ‌పాన్‌లో విడుద‌లై ఘన విజ‌యం సాధించింది. దీంతో జపాన్ లో చెర్రీకి భారీ అభిమానగణం ఏర్పడింది. ఇక రామ్‌చ‌ర‌ణ్‌ జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్‌ గాయపడడంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కొన్నిరోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.