గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్‌ఫ్రే కన్నుమూత

SMTV Desk 2019-04-23 16:59:07  della godfrey, andhrapradesh ex mla

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశనసభ నామినేటెడ్‌ మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్‌ఫ్రే(62) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆరు రోజుల క్రితం ఆమె గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపి శాసనసభకు రెండు సార్లు ఎమ్మెల్యేగా నామినేట్‌ అయ్యారు. ఆమె మృతి పట్ల సియం కేసిఆర్‌ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. నగరంలోని గన్‌ఫౌండ్రిలో సెయింట్‌ జోసఫ్‌ క్యాథడ్రిల్‌లో రేపు మధ్యాహ్నం 4 గంటలకు సామూహిక ప్రార్ధనలు నిర్వహించనున్నారు.