టీ గ్లాస్ పట్టుకొని ఫోటోలకు పోజులిస్తారు.. బొచ్చెల్లో తింటారు.

SMTV Desk 2019-04-23 15:24:55  Sri reddy, pawan Kalyan

‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న చాలా మందిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. తెలుగులో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో నాని పై టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన సర్వే నిర్వహించి వార్తల్లో నిలిచింది. తాజాగా శ్రీరెడ్డి టాలీవుడ్ హీరోలపై మరోసారి తనదైన శైలిలో చెప్పరాని మాటలతో విరుచుపడింది. హైదరాబాద్‌ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ నేర్పిస్తానని చెప్పిన వినయ్ వర్మ..నటన కోసం అమ్మాయిలు బట్టలు లేకుండా నగ్నంగా ఉండాలనే విషయమై స్పందించింది.

ఈ ఘటనపై తెలుగు హీరోలెవరు స్పందించకపోవడంపై శ్రీరెడ్డి తనదైన శైలిలో బూతులు నానా తిట్లు తిట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు వాళ్లంత గాజులు తొడుక్కున్నారు. ఓ అమ్మాయికి యాక్టింగ్ స్కూల్‌లో ఇలాంటి సమస్య వచ్చినపుడు మన హీరోలు సామాజిక బాధ్యతగా స్పందించి ఉంటే బాగుండేది అన్నారు. కానీ ఎవరు ఈ స్పందించలేదు. అమ్మాయిలైన మేమే పోరాడుతున్నాం. మీకు ఏమైంది. సినిమాల్లో బోలేడు బిల్డప్పులు ఇస్తారు. కానీ జీవితంలో అలాంటి ఘటన జరిగితే ఒక్కరు ముందుకు వచ్చి స్పందించకపోవడం విచారకరమంది శ్రీరెడ్డి.

మీరు టీ గ్లాస్ పట్టుకొని ఫోటోలకు పోజులిస్తారు. బొచ్చెల్లో తింటారు. మొక్కలు నాటినట్లు బిల్డప్ ఇస్తారు. కానీ ఒక అమ్మాయికి కష్టం వస్తే మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే విషయంలో వీళ్లకు ధైర్యం లేదంది. మీకు అసలు బాధ్యత లేదు. ఎంతసేపు వైజాగ్, భీమవరం, మాత్రమే కావాలి. ఇదంతా ఓట్లు, నోట్ల కోసమే అన్నట్టు ఇన్‌డైరెక్ట్‌గా జనసేనాని పవన్ కళ్యాణే ఎక్కువగా టార్గెట్ చేసినట్టు కనపడింది.

మరోవైపు హీరోలు ఏం చేయడం లేదని అమ్మాయిలు ధైర్యం చేసి బయటికి వచ్చి పోరాటం చేస్తుంటే.. ఆ అమ్మాయిపై లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు. తెగించింది. పడుకోవడానికి రెడీ అయిపోయింది అంటున్నారు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినపుడు మాట్లాడకుండా ఉండటం సిగ్గుచేటు అంటూ టాలీవుడ్ హీరోలపై ఓ రేంజ్‌లో నిప్పులు కురిపించింది. ఇక శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసిన ఈ వీడియో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.