హైకోర్టుకెక్కిన ఇంటర్ బోర్డు ఫలితాల వ్యవహారం

SMTV Desk 2019-04-23 15:21:59  High court, Hyderabad, Petitions, Indira park

హైదరాబాద్‌: రాష్ట్ర ఇంటర్ బోర్డు ఫలితాల అవకతవకలు ఇప్పుడు కోర్టుకెక్కాయి. తాజాగా హైకోర్టులో బాలల హక్కుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. విద్యార్ధుల జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని పిటిషనర్‌ కోరారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధులకు పరిహారం చెల్లించాలని, బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. తాజా పిటిషనర్‌ను లంచ్‌ మోషన్‌గా తీసుకునేందుకు హైకోర్టు అనుమతించింది.