మెగా హీరోతో గౌతం తిన్ననూరి

SMTV Desk 2019-04-23 15:18:32  Varun Tej

నాని జెర్సీ సినిమాతో తన సత్తా చాటిన డైరక్టర్ గౌతం తిన్ననూరి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. జెర్సీలో అర్జున్ పాత్రతో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చేసిన గౌతం ప్రేక్షకుల నుండే కాదు సెలబ్రిటీస్ నుండి కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక జెర్సీలో నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. నాచురల్ స్టార్ అన్న స్క్రీన్ నేమ్ కు నాని పర్ఫెక్ట్ అనేలా జెర్సీలో అతని నటన ఉంది.

ఇక ఈ సినిమాతో ప్రతిభ చాటుకున్న గౌతం తిన్ననూరిని లాక్ చేశాడు దిల్ రాజు. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే అవుట్ పుట్ ఎలా ఉంటుందో అంచనా వేసిన దిల్ రాజు ఈమధ్యనే వరుణ్ తేజ్ తో తను తీసే హ్యాట్రిక్ మూవీకి కథ సిద్ధం చేయమని గౌతం కు చెప్పాడట. డైరక్టర్ కూడా ఓ లైన్ చెప్పగా దానికి హీరో, ప్రొడ్యూసర్ ఇద్దరు ఓకే చెప్పారట. అందుకే కాబోలు జెర్సీ సినిమా చూసి దిల్ రాజు స్పెషల్ అప్రిసియేషన్ ఈవెంట్ చేశాడు. ఓ మంచి సినిమాను ప్రమోట్ చేసినట్టు ఉండటమే కాకుండా డైరక్టర్ గురించి అందరికి తెలిసేలా చేశాడు. మరి నాని జెర్సీ తర్వాత మెగా హీరోతో గౌతం తిన్ననూరి చేసే ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.